Skip to main content

పారాసిటమాల్‌ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

పారాసిటమాల్‌ మాత్రల ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
Current Affairs
కరోనా బాధితుల చికిత్సలో ఈ మాత్రలు కీలకంగా పనిచేస్తున్నాయని భావించిన ప్రభుత్వం ఈ మందులను విదేశాలకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తగినన్ని నిల్వలు ఉన్నందున ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు ఏప్రిల్ 17న కేంద్ర విదేశీ ఎగుమతుల డైరెక్టర్‌ జనరల్‌ అమిత్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పారాసిటమాల్‌లో వినియోగించే ముడి సరుకు ఎగుమతులపై మాత్రం ఆంక్షలు యథావిధిగా అమలులో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : పారాసిటమాల్‌ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : ప్రస్తుతం దేశంలో తగినన్ని నిల్వలు ఉన్నందున
Published date : 18 Apr 2020 06:08PM

Photo Stories