Skip to main content

పాపులేషన్ స్టేటస్‌ రిపోర్టులు విడుదల

ఇండియన్స్ అసోసియేషన్స్ ఆఫ్‌ పార్లమెంటేరియన్స్ ఫర్‌ పాపులేషన్స్ అండ్‌ డెవలప్‌మెంట్‌ తయారుచేసిన ‘‘స్టేటస్‌ ఆఫ్‌ సెక్స్‌ రేషియోఎట్‌ బర్త్‌ ఇన్ ఇండియా’’, ‘‘ఎల్డర్లీపాపులేషన్ ఇన్ ఇండియా...స్టేటస్‌ అండ్‌ సపోర్ట్‌ సిస్టమ్స్‌’’రిపోర్టులు విడుదలయ్యాయి.
Current Affairs
ఆగస్టు 20న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఈ రిపోర్టులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... పార్లమెంటు, అసెంబ్లీలలో మహిళలకు తగిన రిజర్వేషన్లు కల్పించాలని, ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించిన ఈ ప్రతిపాదన చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడం దురదృష్టకరమని తెలిపారు.

27 శాతం మందికి స్మార్ట్‌ఫోన్ లు లేవు
ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు దేశంలోని కనీసం 27 శాతం మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందుబాటులో లేవని ఎన్సీఈఆర్‌టీ సర్వేలో తేలింది. అంతేకాకుండా... విద్యుత్తు సరఫరాలో అంతరాయం, కరెంటు సౌకర్యం లేకపోవడం కూడా ఆన్లైన్ క్లాసులకు విఘాతమేనని 28 శాతం విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడినట్లు సర్వే తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘‘స్టేటస్‌ ఆఫ్‌ సెక్స్‌ రేషియోఎట్‌ బర్త్‌ ఇన్ ఇండియా’’, ‘‘ఎల్డర్లీపాపులేషన్ ఇన్ ఇండియా...స్టేటస్‌ అండ్‌ సపోర్ట్‌ సిస్టమ్స్‌’’రిపోర్టులు విడుదల
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు
Published date : 24 Aug 2020 08:22PM

Photo Stories