పాక్‌లో భారత రాయభారి బహిష్కరణ
Sakshi Education
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడంపై పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది.
పాక్‌లో పనిచేస్తున్న భారత రాయబారి అజయ్ బిసారియాను పాకిస్తాన్ తమ దేశం నుంచి బహిష్కరించింది. అలాగే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన ఆగస్టు 7న జరిగిన జాతీయ భద్రతా కమిటీ(ఎన్‌ఎస్‌సీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం భారత రాయబారి అజయ్ బిసారియా ఇస్లామాబాద్‌లో పనిచేస్తుండగా, భారత్‌లో పాక్ రాయబారి మొయిన్-ఉల్-హక్ ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. మరోవైపు జమ్మూకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి దృష్టికి తీసుకెళతామని పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత రాయబారి అజయ్ బిసారియా బహిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : పాకిస్తాన్
ఎందుకు : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడంతో

Published date : 08 Aug 2019 05:40PM