Skip to main content

పాకిస్తాన్ విమానాలను ఆధునీకరించం: ఫ్రాన్స్

పాకిస్తాన్‌కు గతంలో విక్రయించిన మిరేజ్ యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థ, అగోస్టా 90బీ జలాంతర్గాములను ఆధునీకరించకూడదని ఫ్రాన్స్ నిర్ణయించింది.
Current Affairsఈ నిర్ణయంతో పాకిస్తాన్ వాయుసేనపై తీవ్ర ప్రభావం పడనుంది. పాక్ వాయుసేనలో ఫ్రేంచ్ కంపెనీ డసాల్ట్ తయారు చేసిన మిరేజ్ 3, మిరేజ్ 5 శ్రేణి యుద్ధ విమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించిన టెక్నాలజీ పాక్ వద్ద లేదు.

ఫ్రాన్స్ నిర్ణయానికి కారణం...
ఫ్రాన్స్ లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు, మత సంఘర్షణలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పందిస్తూ... ఫ్రాన్స్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో మేక్రాన్ తీరును తప్పుబడుతూ... పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ మిరేజ్ యుద్ధ విమానాలను అప్‌గ్రేడ్ చేయరాదని ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది.

ఖతార్‌కు ఆదేశాలు...
ఖతార్‌కు ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్లను విక్రయించింది. ఈ జెట్ల సర్వీసింగ్‌కు పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న నిపుణులకు నియమించరాదని ఖతార్‌ను ఫ్రాన్స్ ఆదేశించింది. ఆశ్రయం కోరుతూ పాకిస్తాన్ పౌరుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను కూడా ఫ్రాన్స్ పక్కనపెడుతోంది.
Published date : 21 Nov 2020 05:53PM

Photo Stories