Skip to main content

పాకిస్తాన్ సూపర్ లీగ్-2020 విజేత?

Edu news
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)-2020 టి20 క్రికెట్ టోర్నీ ఫైనల్లో కరాచీ కింగ్‌‌స జట్టు ఐదు వికెట్ల తేడాతో లాహోర్ ఖలందర్స్‌ను ఓడించి కొత్త విజేతగా అవతరించింది. పాకిస్తాన్‌లోని కరాచీలో నవంబర్ 17న జరిగిన ఫైనల్లో లాహోర్ ఖలందర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. 135 పరుగుల లక్ష్యాన్ని కరాచీ కింగ్‌‌స 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కరాచీ కింగ్స్ ఓపెనర్ బాబర్ ఆజమ్ (49 బంతుల్లో 63; 7 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)-2020 విజేత
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : కరాచీ కింగ్‌‌స జట్టు
ఎక్కడ : కరాచీ, పాకిస్తాన్
Published date : 19 Nov 2020 06:43PM

Photo Stories