Skip to main content

ఒలింపిక్ చాంపియన్ అథ్లెట్ చార్లీ మూర్ కన్నుమూత

అమెరికా మేటి అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత చార్లీ మూర్(91) కన్ను మూశారు. కొంతకాలంగా పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన అక్టోబర్ 8న పెన్సిల్వేనియా రాష్ట్రం(అమెరికా)లోని లాపోర్ట్‌లో తుదిశ్వాస విడిచారని ప్రపంచ అథ్లెటిక్స్ తెలిపింది.
Current Affairs
ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకి వేదికగా జరిగిన 1952 ఒలింపిక్స్‌లో బరిలో దిగిన చార్లీ 400 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. అంతేకాకుండా 1600 మీటర్ల రిలే ఈవెంట్‌లో పాల్గొని రజతం సాధించారు.

ప్రపంచ రికార్డు...
బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌లో పాల్గొన్న చార్లీ 440 మీటర్ల హర్డిల్స్‌లో 51.6 సెకన్లలో గమ్యాన్ని చేరి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. 1978లో కార్నెల్స్ అథ్లెటిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌తోపాటు 1999లో యూఎస్‌ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ హాల్ ఫేమ్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు.

వీడ్కోలు అనంతరం...
క్రీడలకు వీడ్కోలు పలికిన చార్లీ మూర్.. తదనంతర కాలంలో వ్యాపారవేత్తగా, ఇన్వెస్టర్‌గా, అథ్లెటిక్స్ పాలనాధికారిగా పలు బాధ్యతలను నిర్వర్తించారు. తన కెరీర్‌కు తోడ్పాటు అందించిన మెర్సెర్స్‌బర్గ్ అకాడమీకి తాను సాధించిన రెండు ఒలింపిక్ పతకాలను విరాళంగా ఇచ్చారు. హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు మూర్ ‘13 స్టెప్ అప్రోచ్’ టెక్నిక్‌ను సూచించారు. దీనిని అథ్లెట్స్ ఇప్పటికీ హర్డిల్స్‌లో ఉపయోగిస్తుండటం విశేషం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అమెరికా మేటి అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : చార్లీ మూర్(91)
ఎక్కడ : లాపోర్ట్, పెన్సిల్వేనియా రాష్ట్రం, అమెరికా
ఎందుకు : పాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా
Published date : 14 Oct 2020 05:42PM

Photo Stories