ఒకే క్లబ్ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్?
Sakshi Education
ఒకే క్లబ్ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా <b>బార్సిలోనా స్టార్ ప్లేయర్, అర్జెంటీనా జట్టు కెప్టెన్ లయనెల్ మెస్సీ</b> గుర్తింపు పొందాడు.
భారత కాలమానం ప్రకారం స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో డిసెంబర్ 23 జరిగిన స్పానిష్ లీగ్లో రియల్ వాలాడోలిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా జట్టు 3-0తో గెలిచింది. ఆట 65వ నిమిషంలో మెస్సీ గోల్ చేసి పీలే రికార్డు(643 గోల్స్)ను అధిగమించాడు. బ్రెజిల్ దిగ్గజం పీలే 1957 నుంచి 1974 వరకు బ్రెజిల్‌లోని సాంటోస్ క్లబ్ తరఫున ఆడిన పీలే 643 గోల్స్ సాధించాడు.
ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో మెస్సీ 2004 నుంచి బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పీలే 643 గోల్స్‌ను 757 మ్యాచ్‌ల్లో చేయగా... మెస్సీ 644 గోల్స్‌ను 749 మ్యాచ్‌ల్లో సాధించాడు. ఈ జాబితాలో గెర్డ్ ముల్లర్ (బయెర్న్ మ్యూనిక్-564 గోల్స్) మూడో స్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఒకే క్లబ్ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : బార్సిలోనా స్టార్ ప్లేయర్, అర్జెంటీనా జట్టు కెప్టెన్ లయనెల్ మెస్సీ
ఎక్కడ : బార్సిలోనా, స్పెయిన్

Published date : 24 Dec 2020 06:31PM