Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 19th కరెంట్ అఫైర్స్
First Indian Private Rocket : అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త చరిత్రకు భారత్ శ్రీకారం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మొట్టమొదటి ప్రైవేటు రాకెట్.. ప్రారంభ్ (విక్రమ్–ఎస్)ను తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నవంబర్18 (శుక్రవారం) ఉదయం 11.30 గంటలకు విజయవంతంగా నింగిలోకి ప్రయోగించింది. ఇప్పటిదాకా ప్రైవేటు ఉపగ్రహాలను మాత్రమే ఇస్రో ప్రయోగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారి ప్రైవేటు రాకెట్‌ను సైతం ప్రయోగించి రికార్డు సృష్టించింది. ఇందుకు కేవలం 4.50 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంది. ప్రారంభ్ (విక్రమ్–ఎస్)ను హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. స్టార్టప్ కంపెనీలు.. స్పేస్ కిడ్ ఇండియా, ఎన్ స్పేస్‌టెక్, అర్మేనియా బజూమ్ క్యూ స్పేస్ రీసెర్చ్ ల్యాబ్‌కు చెందిన మూడు పేలోడ్‌లను ఈ బుల్లి రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.
భవిష్యత్తులో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు.. వాతావరణ అధ్యయనం కోసం ఈ పేలోడ్లను ప్రయోగించారు. భూమి నుంచి సుమారు 89.5 కిలోమీటర్లు ఎత్తులో సబ్–ఆర్బిటల్‌లోకి విజయవంతంగా వెళ్లిన రాకెట్ తిరిగి శ్రీహరికోట సముద్రతీరానికి 135 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడిపోయింది. అయితే రాకెట్ పైకి వెళ్లిన సమయంలో అందులో ఉన్న పేలోడ్స్ వాతావరణంలో ఉన్న తేమ ఇతర వివరాల సమాచారాన్ని అందించాయి. ఇదొక చారిత్రక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్, ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, ఇన్‌స్పేస్ ఇండ్ చైర్మన్ డాక్టర్ పవన్‌కుమార్ గోయెంకా తదితరులు పాల్గొన్నారు.
ప్రయోగ సమయంలో..
రాకెట్ బరువు: 545 కిలోలు
రాకెట్ పొడవు: 6 మీటర్లు
రాకెట్ వెడల్పు: 0.375 మీటర్లు
భూమి నుంచి ఎత్తు: 89.5 కిలోమీటర్లు
రాకెట్ ప్రయోగం పూర్తి చేసిన సమయం: 4.50 నిమిషాలు
Supreme Court : జనాభా నియంత్రణ మా పని కాదు.. సుప్రీంకోర్టు!
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న జనాభాను నియంత్రించడానికి ‘ఇద్దరు పిల్లల’ విధానాన్ని తప్పనిసరి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వ పరిధిలోని అంశమని జస్టిస్ ఎస్.ఎ.కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకాల ధర్మాసనం వెల్లడించింది. జనాభా పెరుగుదల అనేది ఏదో ఒక మంచి రోజున ఆగిపోయే వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేయాలని కోరుతూ అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలో జనాభా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరికొందరు వేసిన పిటిషన్లపై నవంబర్ 18న సుప్రింకోర్టు దృష్టి సారించింది. జనాభా నియంత్రణ తమ పని కాదని, దానికంటే చేయాల్సిన ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. జనాభాను అరికట్టడానికి తాము చట్టాన్ని తీసుకురాలేమని ఉద్ఘాటించింది. వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని పిటిషనర్లకు సూచించింది.
Free Trade Pact: భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. రిషి సునాక్ స్పష్టీకరణ
భారత్‌తో సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ అన్నారు. ఈ ఒప్పందంపై చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగించాలని భావిస్తున్నామని తెలిపారు. రిషి సునాక్ తాజాగా యూకే పార్లమెంట్ దిగువ సభలో మాట్లాడుతూ ఇండోనేషియాలో జీ–20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఎఫ్‌టీఏ పురోగతిపై సమీక్షించానని వెల్లడించారు. భారత్‌తో ఒప్పందాన్ని ఎప్పటిలోగా కుదుర్చుకుంటారో చెప్పాలని ప్రతిపక్ష లేబర్ పారీ్టతోపాటు అధికార కన్జర్వేటివ్ ఎంపీలు కోరారు. ఒప్పందంపై ప్రధాని మోదీతో ఇప్పటికే మాట్లాడానని, ఈ విషయంలో భారత్–యూకే మధ్య చర్చలకు సాధ్యమైనంత త్వరగా విజయవంతమైన ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. వాస్తవానికి అక్టోబర్ ఆఖరులోనే ఇరు దేశాల చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. కొన్ని అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి ఉందని, పరస్పరం సంతృప్తికరమైన పరిష్కారం కనుక్కొంటామన్నారు. భారత్–యూకే బంధం వాణిజ్యానికి పరిమితమైందని కాదని, అంతకంటే విస్తృతమైనదని సునాక్ తేలి్చచెప్పారు.
TSCHE: క్షణాల్లో నకిలీ సర్టిఫికెట్లు పట్టేయొచ్చు!.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విద్యామంత్రి
Asian Cup Table Tennis 2022: తొలి భారతీయ క్రీడాకారిణిగా మనిక బత్రా..
భారత మహిళల టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా చరిత్ర సృష్టించింది.
ఏషియన్ కప్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ మనిక బత్రా సెమీఫైనల్లోకి వెళ్లింది. నవంబర్ 18న జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ మనిక 6–11, 11–6, 11–5, 11–7, 8–11, 9–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్ చెన్ సు యు (చైనీస్ తైపీ)పై గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మనిక గుర్తింపు పొందింది. ప్రపంచ మహిళల టిటి ర్యాంకింగ్స్‌లో మనిక 44వ స్థానంలో ఉండగా.. చెన్ 23వ ర్యాంక్‌లో ఉన్నారు. నవంబర్17న జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లోనూ మనిక ప్రపంచ 7వ ర్యాంకర్ కింగ్‌టన్‌పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. సెమీస్‌లో మనిక జియోన్ జిహీ(కొరియా), మిమా ఇటో(జపాన్) మ్యాచ్ విజేతతో తలపడనుంది.
Asian Airgun Championship: ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్ షిప్‌లో భారత్‌కు 25 స్వర్ణాలు
కొరియాలోని డేగూలో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్ క్రీడలు నవంబర్ 18న ముగిశాయి. ఈ చాంపియన్ షిప్‌లో భారత షూటర్లు 25 బంగారు పతకాలు సాధించారు. చివరి రోజు సీనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో రిథమ్–విజయ్‌వీర్ జోడీ 17–3తో రఖిమ్‌జాన్–ఇరినా (కజకిస్తాన్) జంటపై గెలిచింది. జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మను బాకర్–సామ్రాట్ జోడీ పసిడి పతకం గెలిచింది.
ఇషా సింగ్ బృందానికి స్వర్ణం
తెలంగాణ షూటర్ ఇషా సింగ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. కొరియాలోని డేగూలో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో ఇషా సింగ్, మను బాకర్, శిఖా నర్వాల్‌తో కూడిన పసిడి నెగ్గింది. నవంబర్ 17న జరిగిన జూనియర్ మహిళల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా జట్టు 16–12తో కొరియాకు చెందిన కిమ్ మిన్సియో, కిమ్ జుహి, యంగ్ జిన్ జట్టుపై విజయం సాధించింది.
ఆంధ్రా నుంచి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వరకు.. ఎన్నో విజయాలు!
Public Sector Banks: పీఎస్‌బీ సీఈవోల పదవీకాలం పెంపు
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సీఈవో, ఎండీల గరిష్ట పదవీకాలాన్ని 10 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నిబంధనను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతిభావంతులను పీఎస్‌బీలు వదులుకోకుండా అట్టే పెట్టుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడనుంది. ఇప్పటివరకు గరిష్ట పదవీకాలం 60 ఏళ్ల సూపర్ యూన్యుయేషన్‌కు లోబడి 5 సంవత్సరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) హోల్–టైమ్ డైరెక్టర్లకు కూడా ఇదే వర్తిస్తోంది. ఎండీలు, హోల్–టైమ్ డైరెక్టర్లకు ప్రాథమికంగా పదవీకాలం అయిదేళ్ల పాటు ఉంటుందని, రిజర్వ్ బ్యాంక్‌తో సంప్రదింపుల మేరకు దీన్ని గరిష్టంగా 10 ఏళ్ల వరకూ పొడిగించవచ్చని ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. పదవీకాలం ముగియడానికి ముందుగానే వారిని ఏ కారణం వల్లనైనా తొలగించాల్సి వస్తే మూడు నెలల ముందు రాతపూర్వక నోటీసులు ఇవ్వాలి. లేదా మూడు నెలల జీతభత్యాలు చెల్లించాలి.
అమెజాన్ సంచలన నిర్ణయం.. భారీగా ఉద్యోగులను తొలగింపు.. కారణం ఇదే.. !
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP