న్యూజిలాండ్ పార్లమెంటరీ కార్యదర్శితో కేటీఆర్ భేటీ
Sakshi Education
న్యూజిలాండ్ ఎత్నిక్ ఎఫైర్స్ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాక్రిష్ణన్‌తో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జనవరి 8న జరిగిన ఈ సమావేశంలో న్యూజిలాండ్, తెలంగాణలో రాజకీయ వ్యవస్థల పనితీరుపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలసి పనిచేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ రెండో దశను ఏర్పాటు చేస్తున్నామని, విదేశీ స్టార్టప్ వ్యవస్థలతో కలసి పనిచేసేందుకు ఉద్దేశించిన ‘టీ బ్రిడ్‌జ’ను బలోపేతం చేస్తామన్నారు.
మా దేశానికి రండి..: తెలంగాణ వ్యవసాయ వర్సిటీతో కలసి పనిచేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ప్రియాంక వెల్లడించారు. తమ దేశంలో తెలంగాణ ఎన్నారైలతో కలసి పనిచేస్తున్నామని, బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : న్యూజిలాండ్ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాక్రిష్ణన్‌తోభేటీ
ఎప్పుడు : జనవరి 8
ఎవరు : తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : ప్రగతిభవన్, హైదరాబాద్
మాదిరి ప్రశ్నలు

1. న్యూజిలాండ్ రాజధాని నగరం, కరెన్సీ(వరుసగా)ని గుర్తించండి.
1. ఆమ్స్టర్ డామ్, న్యూజిలాండ్ పెసో
2. ఆక్లాండ్, న్యూజిలాండ్ డాలర్
3. వెల్లింగ్టన్, న్యూజిలాండ్ డాలర్
4. ది హేగ్, న్యూజిలాండ్ యూరో
- View Answer
- సమాధానం : 3
2. ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు?
1. ఎంజేలా మెర్కెల్
2. మార్గరేట్ థాచర్
3. అంగ్‌సాన్ సూకీ
4. జసిండా ఆర్డెర్న్
- View Answer
- సమాధానం : 4
Published date : 09 Jan 2020 05:25PM