నవరత్నాల అమలుకు హెల్ప్‌లైన్ నంబర్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ పథకం అమలులో భాగంగా ఫిర్యాదులు, స్పందనలు తెలుసుకునేందుకు వీలుగా నాలుగు అంకెలు గల హెల్ప్‌లైన్ నంబర్ 1902ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
ఈ మేరకు కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖ ఆగస్టు 13న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించింది. అలాగే అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని సర్వీసు ప్రొవైడర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కార్యాలయ పర్యవేక్షణలో నడిచే ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నవరత్నాల అమలుకు హెల్ప్‌లైన్ నంబర్ 1902
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : నవరత్నాల అమలుకు హెల్ప్‌లైన్ నంబర్ 1902
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 14 Aug 2019 06:56PM