నవంబర్ లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
Sakshi Education
2019, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 7 మధ్య శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు శ్రీలంక ఎన్నికల సంఘం అధ్యక్షుడు మహీంద్ర దేశప్రియ తెలిపారు.
ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఐదేళ్ల పదవీకాలం 2020 జనవరి 5కి ముగుస్తుంది. నిబంధనల ప్రకారం దీనికి నెల రోజుల ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను ఓడించి 2015 జనవరి 8న సిరిసేన లంక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
Published date : 03 Jun 2019 06:00PM