నిక్లొసమైడ్ యాంటీవైరల్ ఔషధాన్ని ఏ వ్యాధి చికిత్సలో వాడతారు?
Sakshi Education
టేప్ వార్మ్ (ఏలికపాముల) చికిత్సలో వాడే ‘నిక్లొసమైడ్’ యాంటీవైరల్ ఔషధాన్ని కోవిడ్ చికిత్సకు ఉపయోగించవచ్చని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగం ప్రతిపాదించింది.
గత 50 ఏళ్లుగా నిక్లొసమైడ్‌నుటేప్‌వార్మ్ సమస్యకు ఔషధంగా వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవశ్యక ఔషధాల జాబితాలో ఇది కూడా ఉంది. 2003–04లో వచ్చిన ‘సార్స్’ చికిత్సకు కూడా దీనిని వాడారు. కోవిడ్‌కి కూడా ఈ ఔషధాన్ని వినియోగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు జూన్ 3న రిలయన్స్ సంస్థ తాజా వార్షిక నివేదిక పేర్కొంది. అయితే, నిక్లొసమైడ్‌నుకోవిడ్‌కు వినియోగించే విషయమై ఫేజ్ –2 క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది.
Published date : 05 Jun 2021 01:02PM