Skip to main content

నగరాలు, పట్టణాల్లో మెరుగైన వాయు నాణ్యత: సీపీసీబీ

దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత క్రమంగా పెరుగుతోంద‌ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్ల‌డించింది.
Current Affairs

లాక్‌డౌన్‌తో వాహనాలు, ఇతరత్రా రూపాల్లోని కాలుష్యం గణనీయంగా తగ్గిపోవడంతో గాలి నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయ‌ని పేర్కొంది. 2019, మార్చి 29న వివిధ నగరాల్లోని వాయునాణ్యతతో.. 2020 ఏడాది మార్చి 29న అవే నగరాల్లోని గాలి నాణ్యతను పోల్చి చూడగా పలు అంశాలు వెల్లడయ్యాయి.


సమీర్‌యాప్ ద్వారా...

దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను (ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌) సీపీసీబీ వాస్తవ సమయం (రియల్‌టైం)లో పరిశీలించి ‘సమీర్‌యాప్‌’ద్వారా ఆ వివరాలను ఒక సూచీ ద్వారా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. 2019 వేసవి సందర్భంగా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్‌ మహానగరం వంద పాయింట్లకు పైబడి ఉండగా, ప్రస్తుతం వాయునాణ్యత 68 పాయింట్లుగా ఉంది.

వాయునాణ్యత తీరు...

ఏక్యూఐలో 50 పాయింట్ల లోపు ఉంటే స్వచ్ఛ మైన వాతావరణంతో పాటు అతినాణ్యమైన వాయువు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు లెక్కిస్తారు. 50 నుంచి 100 పాయింట్ల వరకు మంచి వాయు నాణ్యత ఉన్నట్లు అంచనా వేస్తారు.

Current Affairs


Current Affairs

Published date : 03 Apr 2020 06:50PM

Photo Stories