Skip to main content

నెఫ్ట్ లావాదేవీలు ఇక 24/7 :ఆర్‌బీఐ

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్‌‌స ట్రాన్స్ ఫర్ (నెఫ్ట్/ఎన్‌ఈఎఫ్‌టీ) వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారనుంది.
Current Affairsరోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ (ఆదివారం, అన్ని సెలవుదినాల్లోనూ) నెఫ్ట్ లావాదేవీలను అనుమతించనున్నట్టు ఆర్‌బీఐ డిసెంబర్ 6న ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. డిసెంబర్ 16న (డిసెంబర్ 15 అర్ధరాత్రి) 00.30 గంటలకు మొదటి నెఫ్ట్ సెటిల్‌మెంట్ జరుగుతుంది. లావాదేవీలు సాఫీగా సాగిపోయేందుకు వీలుగా బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద తమ కరెంటు ఖాతాల్లో తగినంత నిధుల లభ్యత ఉండేలా చూసుకోవాలని, అవసరమైన ఏర్పాట్లను కూడా చేసుకోవాలని కేంద్ర బ్యాంకు కోరింది. రెండు గంటల్లోపు లావాదేవీ మొత్తం స్వీకర్త ఖాతాలో జమ చేయడం లేదా పంపిన వ్యక్తిన ఖాతాకు వెనక్కి జమ చేయడం ఇక ముందూ కొనసాగనుంది. నెఫ్ట్ లావాదేవీల ప్రోత్సాహానికి గాను వీటిపై చార్జీలను ఆర్‌బీఐ లోగడే ఎత్తివేసింది. నెఫ్ట్ లావాదేవీలను గంటకోసారి ఒక బ్యాంచ్ కింద క్లియర్ చేస్తుండడం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం.

క్విక్ రివ్వూ:
ఏమిటి:
నెఫ్ట్ లావాదేవీలు ఇక 24/7
ఎప్పుడు: డిసెంబర్ 16 నుంచి
ఎందుకు: లావాదేవీలు సాఫీగా సాగిపోయేందుకు
Published date : 07 Dec 2019 05:18PM

Photo Stories