Skip to main content

నెల్లూరు విమానశ్రయానికి శంకుస్థాపన

నెల్లూరు జిల్లా, దగదర్తి మండలం దామవరం దగ్గర నిర్మించనున్న విమానశ్రయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 11న శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఏడాదిలో విమానశ్రయం పూర్తి చేసి సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

మరోవైపు ఏన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 2000లకు పెంచుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పెంచిన మొత్తం 2019, జనవరి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. మహిళలు, 8,9,10 తరగతులు చదివే బాలికల ఆరోగ్య భద్రతకు రక్ష పథకం కింద శానిటరీ నాప్‌కిన్‌లను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : నెల్లూరు విమానశ్రయానికి శంకుస్థాపన
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : దామవరం, దగదర్తి మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 12 Jan 2019 06:17PM

Photo Stories