నదుల పునరుజ్జీవం కార్యక్రమానికి ఎంపికైన నదులు?
Sakshi Education
ఎండిన నదులకు పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘‘నదుల పునరుజ్జీవం’’ పేరుతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
ఈ కార్యక్రమం కింద శ్రీకాకుళం జిల్లాలోని చంపావతి, ప్రకాశంలో గుండ్లకమ్మ, అనంతపురంలో పెన్నా, కర్నూలులో హంద్రీ, వైఎస్సార్ జిల్లాలో పాపాగ్ని, చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదులను ఎంపిక చేశారు. తమిళనాడులోని నాగా నది విషయంలో వచ్చిన సత్ఫలితాల స్ఫూర్తితో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ పథకం నిధులను ఉపయోగించనున్నారు. కార్యక్రమంలో భాగంగా ఒక్కో నది పునరుజ్జీవానికి మూడేళ్లలో రూ.50–70 కోట్లు ఖర్చుపెట్టనున్నారు.
నాగా నది అనుభవంతో..
తమిళనాడులో ఎండిపోయిన నాగా నది పునరుజ్జీవనానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ (ఆర్ట్ ఆఫ్ లివింగ్)కు చెందిన 'వ్యక్తి వికాస కేంద్ర ఇండియా' సంస్థ చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చింది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని మెరుగైన ఫలితాల సాధనకు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ పథకానికి రూపకల్పన చేశారు. కర్ణాటకలో కూడా మరో నదికి పనిచేసిన అనుభవం ఈ సంస్థకు ఉండడంతో ఏపీ ప్రభుత్వం ఈ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది. దీంతో నదుల పునరుజ్జీవం కార్యక్రమానికి వ్యక్తి వికాస కేంద్ర సహకారం అందించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నదుల పునరుజ్జీవం కార్యక్రమానికి చంపావతి, గుండ్లకమ్మ, పెన్నా, హంద్రీ, పాపాగ్ని, స్వర్ణముఖి నదుల ఎంపిక
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఎండిన నదులకు పునరుజ్జీవం తీసుకొచ్చేందుకు

Published date : 30 Mar 2021 02:57PM