Skip to main content

నాస్కామ్ అధ్యక్షురాలితో కేటీఆర్ భేటీ

నాస్కామ్ అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో అక్టోబర్ 25న జరిగిన ఈ సమావేశంలో నూతన సాంకేతికతలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను దేవయాని ఘోష్‌కు కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... 2020ను ‘కృత్రిమ మేథస్సు సంవత్సరం’గా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం, పట్టణ రవాణా, ఆరోగ్య రక్షణ రంగాల్లో కృత్రిమ మేథస్సు వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వచ్చే ఏడాది పొడవునా కృత్రిమ మేథస్సు అంశంపై అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నైపుణ్య శిక్షణలోనూ నాస్కామ్ భాగస్వామిగా ఉంటుందని దేవయాని చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
నాస్కామ్ అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌తో భేటీ
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : ప్రగతిభవన్, ప్రగతిభవన్
Published date : 26 Oct 2019 05:45PM

Photo Stories