నాసా మూన్ మిషన్‌కు ఎంపికైన ఇండో అమెరికన్?
Sakshi Education
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ ‘‘ఆర్టిమిస్-III’’లో పాల్గొనే 18 మంది పేర్లను ఖరారు చేసింది.
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ డిసెంబర్ 11న ఈ 18 మంది పేర్లను ప్రకటించారు. ఈ 18 మంది జాబితాలో ఇండియన్ అమెరికన్, హైదరాబాద్ మూలాలున్న రాజా జాన్ వుర్పుతూర్ చారికి చోటు లభించింది. 1970 తర్వాత మళ్లీ చంద్రుడిపైకి యాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్న నాసా ఈ సారి వ్యోమగాముల ఎంపికలో ఎన్నో ప్రత్యేకతలు కనబరిచింది.
వ్యోమగాముల ఎంపిక-ప్రత్యేకతలు...
- మొత్తం 18 మంది వ్యోమగాముల్ని ఎంపిక చేస్తే, అందులో తొమ్మిది మంది మహిళలే.
- విభిన్న జాతుల వారూ ఈ సారి స్థానం దక్కించుకున్నారు.
- వ్యోమగాముల బృందంలో ఎక్కువ మంది 30, 40 వయసులో ఉన్న వారే.
- నాసా ఆర్టిమిస్ మిషన్ 2024లో చంద్రుడిపైకి వెళ్లనుంది.
- ఈ సారి చంద్రుడిపైన తొలుత ఒక మహిళే కాలు మోపుతుంది. ఆ తర్వాతే బృందంలో మిగిలిన వారు అడుగు పెడతారు.
- 2019 ఏడాది మొదటి సారిగా స్పేస్ వాక్ చేసిన {Mిస్టినా కొచ్, జెస్సికా మీర్లు మూన్ మిషన్‌లో కూడా ఉన్నారు.
- ఈ బృందానికి పాట్ ఫారెస్ట్ నేతృత్వం వహిస్తున్నారు.
ప్రవాస భారతీయుడు రాజాచారి...
- నాసా మూన్ మిషన్ యాత్రికుల్లో ఒకరైన ప్రవాస భారతీయుడు రాజాచారి హైదరాబాద్ మూలాలున్న వ్యక్తి. రాజాచారి తాతది మహబూబ్‌నగర్.
- 1977 జూన్ 25న జన్మించిన రాజాచారి మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఇంజనీరింగ్ చదివారు. ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ చేశారు.
- అమెరికా ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పని చేశారు.
- 2017లో వ్యోమగాముల శిక్షణ కార్యక్రమానికి ఎంపికైన 43 ఏళ్ల రాజాచారి... 2020, ఏడాది జనవరిలో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
చదవండి:
ఒకే మిషన్‌లో ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామి?(పార్ట్-2)
మహిళల స్పేస్‌వాక్ విజయవంతం(పార్ట్-1)
Published date : 12 Dec 2020 05:44PM