నాడు-నేడు పర్యవేక్షణాధికారిగా పీటర్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ, వైద్య ఆరోగ్యశాఖలో ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద చేపట్టిన పనులకు పర్యవేక్షణాధికారిగా రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్‌చీఫ్ (రిటైర్డ్) అధికారి ఎఫ్‌సీఎస్ పీటర్ నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని డిసెంబర్ 1న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు శాఖల్లో చేపట్టే కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను పీటర్ పర్యవేక్షిస్తారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు-నేడు ద్వారా సకాలంలో పనులు జరుగుతున్నాయా లేదా, నిర్మాణాల తీరు, మౌలిక వసతుల కల్పన, టెండర్ల వ్యవహారం తదితర అంశాలను ఆయన పరశీలించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాడు-నేడు పర్యవేక్షణాధికారిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : ఎఫ్‌సీఎస్ పీటర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాడు-నేడు పర్యవేక్షణాధికారిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : ఎఫ్‌సీఎస్ పీటర్
Published date : 02 Dec 2019 05:42PM