Skip to main content

నాదస్వర విద్వాన్ నాగూర్ కన్నుమూత

ప్రముఖ నాదస్వర విద్వాన్ నాగూర్ సాహెబ్ (90) అనారోగ్యం కారణంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో జనవరి 17న కన్నుమూశారు.
1930లో ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కశ్యాపురం గ్రామంలో ఖాశీం సాహెబ్, హుస్సేన్‌భీ దంపతులకు నాగూర్ సాహెబ్ జన్మించారు. ఆయన తండ్రి ఖాశీం, సోదరుడు దస్తగిరి కూడా నాదస్వర విద్వాంసులే.

కర్ణాటక సంగీతం నేర్చుకున్న నాగూర్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రంలో 1965 నుంచి 2000 సంవత్సరం వరకు నాదస్వర కచేరీలు చేశారు.సుమారు 5వేల మందికిపైగా ఔత్సాహిక కళాకారులకు హర్మోనియం, నాదస్వరం, ప్లూట్, క్లారినట్ వంటి ఎన్నో వాయిద్యాలను నేర్పారు. 2011లో తమిళనాడు ప్రభుత్వం నుంచి పద్మశ్రీ షేక్ చినమౌలానా స్మారక అవార్డును, నాదస్వర విద్వాన్, నాద కోవిద బిరుదులను అందుకున్నారు. అలాగే సంగీత దర్శకుడు కె.విశ్వనాథ్‌చే నాదస్వర మణిరత్న బిరుదును పొందారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ నాదస్వర విద్వాన్ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : నాగూర్ సాహెబ్ (90)
ఎక్కడ : అద్దంకి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అనారోగ్యం కారణంగా
Published date : 18 Jan 2019 05:24PM

Photo Stories