Skip to main content

మ్యూచువల్‌ ఫండ్స్‌కు రూ.50,000 కోట్ల నిధులు

డెట్‌ మార్కెట్లో నిధుల లేమికి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాత్కాలిక పరిష్కారం చూపించింది.
Current Affairs

రూ.50,000 కోట్ల నిధులను మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు బ్యాంకుల ద్వారా అందించే ప్రత్యేక రెపో విండో ఏర్పాటును ఏప్రిల్ 27న ప్రకటించింది. డెట్‌ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పెరగడం, అదే సమయంలో మార్కెట్లో కొత్తగా వచ్చే పెట్టుబడులు తగ్గడంతో నిధుల కటకట పరిస్థితి నెలకొంది. ఈ నేప‌థ్యంలో ఆర్‌బీఐ తాజా ప్యాకేజీ ప్రక‌టించింది. దీంతో ఫండ్స్‌ సంస్థలకు నిధుల లభ్యత పెరగనుంది. ఫలితంగా అవి తమకు ఎదురయ్యే పెట్టుబడుల ఉపసంహరణలకు చెల్లింపులు చేసే వీలు కలుగుతుంది.ఔ


90
రోజుల కాల పరిమితితో..
మ్యూచువల్‌ ఫండ్స్‌కు ప్రత్యేక నిధుల సదుపాయం (ఎస్‌ఎల్‌ఎఫ్‌–ఎంఎఫ్‌) కింద ఆర్‌బీఐ 90 రోజుల కాల పరిమితితో రూ.50,000 కోట్ల మేర రెపో ఆపరేషన్స్‌ను చేపడుతుంది. 4.4 శాతం ఫిక్స్‌డ్‌ రెపో రేటుపై ఈ నిధులను బ్యాంకులకు అందిస్తుంది. 2020, ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు ఈ పథకం (విండో) అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయం కింద తీసుకునే నిధులను బ్యాంకులు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) నిధుల అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది. అంటే ఫండ్స్‌కు రుణాలను అందించడం, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కలిగి ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ కార్పొరేట్‌ బాండ్లు, కమర్షియల్‌ పేపర్లు, డిబెంచర్స్, సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్ల కొనుగోలుకు బ్యాంకులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

గ‌తంలో...

మ్యూచువల్‌ ఫండ్స్‌కు నిధులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. వాటి అవసరాల కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.25,000 కోట్ల రుణాలను అందించేందుకు 2013 జూలైలో ఆర్‌బీఐ ప్రత్యేక విండోను తెరిచింది. అదే విధంగా లెహమాన్‌బ్రదర్స్‌ సంక్షోభం అనంతరం 2008 అక్టోబర్‌లోనూ ఆర్‌బీఐ ఇదే తరహా నిర్ణయంతో ముందుకు వచ్చింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మ్యూచువల్‌ ఫండ్స్‌కు రూ.50,000 కోట్ల నిధులు
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎందుకు : డెట్‌ మార్కెట్లో నిధుల కొర‌త‌ను త‌గ్గించేందుకు
Published date : 28 Apr 2020 06:52PM

Photo Stories