Skip to main content

ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించిన ఫ్రాంటియర్ పుస్తక రచయిత?

సీనియర్ జర్నలిస్ట్ రెహనా రచించిన ఫ్రాంటియర్ పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు.
Current Affairsమార్చి 19న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ఇందుకు వేదికైంది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవోగా మురళీధరన్‌
ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవోగా కే మురళీధరన్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇతను పుదుచ్చేరిలోని కరైకల్‌ పోర్టు సీఈవోగా ఉన్నారు. పోర్టు రంగంలో అపార అనుభవం గడించారు. ప్రస్తుతం మారిటైమ్‌ బోర్డు సీఈవోగా ఉన్న ఎన్‌పీ రామకృష్ణారెడ్డిని పూర్తి స్థాయి అదనపు బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
Published date : 23 Mar 2021 11:37AM

Photo Stories