మరణానంతరం ‘పద్మవిభూషణ్’పురస్కారాలు వీరికే..
Sakshi Education
దివంగతులైన వారికి వరించిన పద్మవిభూషణ్ పురస్కారాలు:
1. అరుణ్ జైట్లీ
2. సుష్మా స్వరాజ్
3. జార్జి ఫెర్నాండెజ్
4. విశ్వేశతీర్థ స్వామీజీ
1. అరుణ్ జైట్లీ:
2019 మేలో ఈయన మృతి చెందారు. 2014-19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా అరుున జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను విలీనం చేశారు.
2. సుష్మా స్వరాజ్:
బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా.
3. జార్జి ఫెర్నాండెజ్:
కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అరుున జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్‌సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ బిహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు.
4. శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ:
ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి.

Published date : 31 Jan 2020 06:19PM