Skip to main content

మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌కు గుర్తింపు

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. అంతర్జాతీయ సంస్థ మెర్సర్ ప్రతి ఏడాది వివిధ అంశాలపై నిర్వహించే సర్వేలో ఉత్తమంగా నిలిచి వరుసగా ఐదోసారి స్థానం దక్కించుకుంది.
ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మార్చి 14న ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘న్యూయార్క్‌కు చెందిన మెర్సర్ సంస్థ ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాల్లో సర్వే నిర్వహిస్తుంది. ఈసారి మొత్తం 230 నగరాల్లో సర్వే చేయగా, మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌కు గుర్తింపు దక్కింది. దేశానికి సంబంధించి శాంతిభద్రతల పరిరక్షణ విభాగంలో చెన్నై మొదటి స్థానంలో ఉండగా... హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే లివింగ్ ఇండెక్స్ కేటగిరీలో పుణేతో కలిసి ప్రథమ స్థానంలో నిలిచింది. పోలీసులకు నగర ప్రజలు అందిస్తున్న సహకారం, సీసీ కెమెరాల ఏర్పాటులో తోడ్పాటు తదితరాల నేపథ్యంలో వరుసగా ఐదోసారి హైదరాబాద్‌కు ఈ గుర్తింపు సాధ్యమైంది’అని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌కు 4వ స్థానం
ఎప్పుడు : మార్చి 14
ఎందుకు : మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
Published date : 15 Mar 2019 06:12PM

Photo Stories