మోల్డో బోర్డర్ పాయింట్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది?
Sakshi Education
తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు, బలగాల ఉపసంహరణ కోసం ఇరుదేశాల మిలటరీ అధికారుల మధ్య తూర్పు లద్దాఖ్‌లో మోల్డో బోర్డర్ పాయింట్లో ఫిబ్రవరి 21 పదో దఫా చర్చలు జరిగాయి.
హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెప్సాంగ్‌లలో సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇరుపక్షాలు చర్చలు జరిపాయి. గోగ్రా, గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్ లలో సైన్యం ఉపసంహరణపై ఒక అవగాహనకు వచ్చినప్పటికీ డెప్సాంగ్, డెమ్‌చోక్‌లపై ఎలాంటి అవగాహన కుదరలేదు. డెప్సాంగ్ ప్రాంతంలో ఉద్రిక్తతల నివారణకు 2013 తర్వాత చైనా చర్చించడం ఇదే మొదటిసారి.
చర్చల్లో భారత ప్రతినిధుల బృందానికి 14 కార్ప్స్ కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ పీజీకే మీనన్, చైనా బృందానికి దక్షిణ జిన్‌జియాంగ్ మిలటరీ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ నేతృత్వం వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్, చైనాల మధ్య పదో దఫా చర్చలు
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : లెఫ్ట్‌నెంట్ జనరల్ పీజీకే మీనన్, మేజర్ జనరల్ లియూ లిన్
ఎక్కడ : మోల్డో బోర్డర్ పాయింట్, తూర్పు లద్దాఖ్, భారత్-చైనా సరిహద్దు
ఎందుకు : తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు, బలగాల ఉపసంహరణ కోసం

Published date : 22 Feb 2021 06:12PM