మోడల్ టెనన్సీ యాక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
Sakshi Education
యజమాని, కిరాయిదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా రూపొందిన చట్టం... ‘మోడల్ టెనన్సీయాక్ట్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
పలు కీలక సంస్కరణలతో కూడిన ఈ నమూనా చట్టానికి జూన్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి భేటీలో ఆమోదం లభించింది. వివాదాల సత్వర పరిష్కారం కోసం జిల్లాల్లో ప్రత్యేక రెంట్ అథారిటీలు, రెంట్ కోర్టులు, రెంట్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు యథాతథంగా అమలు చేసుకోవచ్చు. లేదా ఇప్పటికే తమ వద్ద అమల్లో ఉన్న సంబంధిత చట్టాలకు అవసరమైన మార్పులు చేసి, అమలు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆస్తులను అద్దెకు ఇవ్వడానికి సంబంధించిన న్యాయ ప్రక్రియలో ఈ కొత్త చట్టం ద్వారా సమూల మార్పులు వస్తాయని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మోడల్ టెనన్సీయాక్ట్’కు ఆమోదం
ఎప్పుడు :జూన్ 2
ఎవరు :కేంద్ర కేబినెట్
ఎందుకు :యజమాని, కిరాయిదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : మోడల్ టెనన్సీయాక్ట్’కు ఆమోదం
ఎప్పుడు :జూన్ 2
ఎవరు :కేంద్ర కేబినెట్
ఎందుకు :యజమాని, కిరాయిదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా
Published date : 04 Jun 2021 02:29PM