Skip to main content

మోదీ ప్రభుత్వం తప్పులేదు: నానావతి కమిషన్

2002 నాటి గుజరాత్ అల్లర్ల విషయంలో అప్పటి ఆరాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తప్పేమీ లేదని జస్టిస్ నానావతి కమిషన్ స్పష్టం చేసింది.
Current Affairs అల్లర్ల సమయంలో కొన్ని చోట్ల తగినంత సిబ్బంది లేక పోలీసులు మూకలను నియంత్రించడంలో విఫలమయ్యారని పేర్కొంది. రాష్ట్ర మంత్రుల స్ఫూర్తితోగానీ, రెచ్చగొట్టడం వల్లకానీ, ప్రోత్సహించడం వల్లగానీ 2002లో ఒక వర్గంపై దాడులు జరిగాయనేందుకు ఆధారాలు లేవని వివరించింది. గుజరాత్ హోం శాఖ మంత్రి ప్రదీప్ సిన్‌‌హ జడేజా డిసెంబర్ 11న నానావతి కమిషన్ రిపోర్టును ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో వెయ్యి మందికి పైగా ప్రజలు మరణించారు. వీటిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ నానావతి, గుజరాత్ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అక్షయ్ మెహతాల ఆధ్వర్యంలో అప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి, రాష్ట్రమంత్రులు, పోలీసు అధికారుల పాత్రను కూడా పరిశీలించాలని కమిషన్‌ను కోరింది. ఈ కమిషన్ తొలి నివేదికను 2009 సెప్టెంబరులో సమర్పించగా తుది నివేదికను 2014 నవంబరు 18న ప్రభుత్వానికి అందించింది. అయితే తాజాగా(2019, డిసెంబర్ 11) ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Published date : 12 Dec 2019 06:30PM

Photo Stories