Skip to main content

మొనాకో గ్రాండ్‌ప్రి రద్దు

ఫార్ములావన్ (ఎఫ్1) క్యాలెండర్‌లో 65 ఏళ్లుగా నిర్విరామంగా జరుగుతోన్న విఖ్యాత వీధి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి రద్దయింది.
Current Affairsప్రస్తుతం కోవిడ్-19 యూరప్‌లో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మార్చి 20న నిర్వాహకులు ప్రకటించారు. 2020, మే 24న ఈ రేసు జరగాల్సి ఉంది. దాంతో ఈ ఏడాది ఎఫ్1 సీజన్‌లో రద్దయిన రెండో రేసుగా మొనాకో నిలిచింది. 1929లో ఎఫ్1 క్యాలెండర్‌లో అరంగేట్రం చేసిన ఈ రేసు చివరిసారిగా 1954లో జరగలేదు. ఇప్పటికే తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (జీపి)ని నిలివేసిన విషయం తెలిసిందే.

మరోవైపు మార్చి 22న జరగాల్సిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి, ఏప్రిల్‌లో జరగాల్సిన వియత్నాం, చైనీస్ రేసులను కూడా వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్‌ఐఏ) నిర్ణయం తీసుకుంది.
Published date : 21 Mar 2020 06:02PM

Photo Stories