Skip to main content

మొజాంబిక్‌లో తీవ్రవాదుల దాడి

తూర్పు ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో ఇస్లామిక్ తీవ్రవాదులు మే 28న 16 మందిని హతమార్చిన ఘటన మే 31న వెలుగులోకి వచ్చింది.
మిత్సుబిషి ట్రక్కులో ప్రయాణికులు, సరుకులను వేసుకుని వెళ్తుండగా తీవ్రవాదులు దాడి చేశారు.ఈ ఘటనలో మొత్తం 16 మంది చనిపోయారు. మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో అనే ముస్లిం ఆధిక్య ప్రాంతంలో ఇస్లామిక్ తీవ్రవాదులు 2017 అక్టోబర్ నుంచి దాడులకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు కనీసం 200 మంది ప్రజలను చంపేశారు.

మరోవైపు అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో మే 31న అమెరికా కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడిలో నలుగురు పౌరులు మరణించారు.
Published date : 01 Jun 2019 05:32PM

Photo Stories