మనబడి నాడు-నేడు కార్యక్రమంతొలుత ఎక్కడ ప్రారంభమైంది?
Sakshi Education
చదువుల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేలా రాష్ట్రంలో నూతన విద్యావిధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
నూతన విద్యా విధానంలో ఆరు రకాలుగా స్కూళ్లు ఉంటాయని, మొత్తం 57 వేల పాఠశాలలను ‘నాడు–నేడు’ ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 16న తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం జడ్పీ హైస్కూలులో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా మనబడి నాడు-నేడుసర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తొలివిడత స్కూళ్లను విద్యార్థులకు అంకితం చేయడంతోపాటు రెండో విడత పనులను కూడాప్రారంభించారు. జగనన్నవిద్యాకానుక కింద రెండో విడత స్టూడెంట్స్ కిట్లను పంపిణీ చేశారు.మనబడి నాడు–నేడు తొలివిడత ద్వారా 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేసిన నేపథ్యంలో ఆగస్టు 16 నుంచి రెండో విడత స్కూళ్లలో నాడు – నేడు పనులకు శ్రీకారం చుడుతున్నట్లు సీఎం ప్రకటించారు.57 వేల పాఠశాలలరూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమం తొలుత ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019, నవంబర్ 14న ఈ పథకాన్ని ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :మనబడి నాడు-నేడు రెండో విడత పనులు ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు16
ఎవరు :ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ :పి.గన్నవరం జడ్పీ హైస్కూలు, తూర్పు గోదావరి జిల్లా
ఎందుకు :పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు...

Published date : 17 Aug 2021 04:06PM