Skip to main content

మలేసియా ప్రధానిగా మొహియుద్దీన్ ప్రమాణం

మలేసియా నూతన ప్రధానమంత్రిగా మొహియుద్దీన్ యాసిన్ మార్చి 1న ప్రమాణం చేశారు.
Current Affairsమలేసియా రాజు సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా సమక్షంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రిబూమి బెర్సాతు మలేసియా (పీపీబీఎం) వ్యవస్థాపకుడైన మొహియుద్దీన్‌కు యునెటైడ్ మలయ్స్ నేషనల్ ఆర్గనైజేషన్ (యూఎంఎన్‌ఓ), ఇతర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మొహియుద్దీన్ గతంలో మలేసియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఇప్పటివరకు మలేసియా ప్రధానమంత్రిగా పనిచేసిన మహతీర్ మొహమాద్ 2020, ఫిబ్రవరి 24న తన పదవికి రాజీనామా చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మలేసియా నూతన ప్రధానమంత్రిగాప్రమాణం
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : మొహియుద్దీన్ యాసిన్
Published date : 02 Mar 2020 05:36PM

Photo Stories