మలబార్ విన్యాసాల్లో కొత్తగా పాల్గొననున్న ద్వీప దేశం?
Sakshi Education
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో 2020, నవంబర్ నెలలో జరగనున్న మలబార్ సైనిక యుద్ధ విన్యాసాల్లో అమెరికా, జపాన్‌తోపాటు ఆస్ట్రేలియా పొల్గొంటుందని భారత్ అక్టోబర్ 19న ప్రకటించింది.
మలబార్ ఎక్సర్‌సైజ్ ద్వారా నాలుగు దేశాల నావికా దళాల మధ్య సహకారం మరింత పెరుగుతుందని భారత రక్షణశాఖ పేర్కొంది. ఉమ్మడి శత్రువైనా చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చతుర్భుజ కూటమి(క్వాడ్) పేరిట జట్టు కట్టిన సంగతి తెలిసిందే.
ఇదే మొదటిసారి...
ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో మలబార్ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్ నావికా దళాలు పాల్గొనడం పరిపాటి. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. క్వాడ్‌లోని నాలుగు సభ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదికపైకి రానుండడం ఇదే మొదటిసారి. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌లో చైనా తరచుగా ఘర్షణకు దిగుతున్న నేపథ్యంలో నాలుగు దేశాల డ్రిల్ ప్రాధాన్యం సంతరించుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మలబార్ సైనిక యుద్ధ విన్యాసాల నిర్వహణ
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా
ఎక్కడ : బంగాళాఖాతం, అరేబియా సముద్రం
ఎందుకు : ఇండో-పసిఫిక్ తీర ప్రాంత భద్రతలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో

Published date : 20 Oct 2020 05:32PM