మిషన్ శక్తితో ఐఎస్‌ఎస్‌కు ముప్పు
Sakshi Education
శత్రుదేశాల ఉపగ్రహాలు కూల్చేసేందుకు ఇటీవల భారత్ చేపట్టిన శాటిలైట్ విధ్వంసక క్షిపణి (ఏశాట్) పరీక్ష వల్ల అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికే (ఐఎస్‌ఎస్) ముప్పు వాటిల్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించింది.
ఆ ప్రయోగం వల్ల అంతరిక్షంలో దాదాపు 400 వ్యర్థ శకలాలు పోగుపడ్డాయని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రెడైన్‌స్టిన్ తెలిపారు. 60 వ్యర్థ శకలాలను గుర్తించామని, అందులో 24 ఐఎస్‌ఎస్‌కు అతి దగ్గరలో ఉన్నాయని చెప్పారు.
కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాలను కూల్చేయగల చరిత్రాత్మక ‘మిషన్ శక్తి’ని విజయవంతంగా భారత్ ప్రయోగించినట్లు ప్రధాని మోదీ మార్చి 27న వెల్లడించడం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిషన్ శక్తితో ఐఎస్‌ఎస్‌కు ముప్పు
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా

Published date : 03 Apr 2019 06:20PM