మహిళల టి20 ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియా
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచ కప్-2020 విజేతగా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు నిలిచింది.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో మార్చి 8న జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 85 పరుగుల భారీ తేడాతో భారత జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. తొలిసారి ఫైనల్ చేరిన భారత్ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. ఈ టోర్నిలో ఆస్ట్రేలియా జట్టుకు మెగ్ లానింగ్, భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించారు. ఆసీస్ జట్టుకు చెందిన బెత్ మూనీ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది. ఆస్ట్రేలియాకు ఇది 5వ ప్రపంచకప్ టైటిల్. 7 సార్లు టోర్నీ జరిగితే ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి నెగ్గాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ మహిళల టి20 ప్రపంచ కప్-2020 విజేత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జటు
ఎక్కడ : మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ), మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ మహిళల టి20 ప్రపంచ కప్-2020 విజేత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జటు
ఎక్కడ : మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ), మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
Published date : 10 Mar 2020 06:50PM