మహిళల 1,500 మీటర్లలో సరికొత్త ప్రపంచ రికార్డు
Sakshi Education
ఇథియోపియా మహిళా అథ్లెట్ గుడాఫ్ సెగే... 1,500 మీటర్ల ఇండోర్ విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
నార్తర్న్ ఫ్రాన్స్ లో జరిగిన మీట్‌లో ఆమె 1,500 మీటర్ల పరుగును 3 నిమిషాల 53.09 సెకన్లలో పూర్తి చేసింది. గతంలో యూరోపియన్ ఇండోర్ చాంపియన్ లౌరా ముయిర్ (3ని.59.58 సెకన్లు) పేరిట ఉన్న రికార్డును సెగే సవరించింది.
ఉత్తమ అథ్లెట్లు నందిని, యశ్వంత్...
జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్-2021లో తెలంగాణ అమ్మాయి అగసారా నందిని అండర్-18 బాలికల విభాగంలో... ఆంధ్రప్రదేశ్ అబ్బాయి యశ్వంత్ కుమార్ అండర్-20 బాలుర విభాగంలో ‘ఉత్తమ అథ్లెట్’ అవార్డులు గెల్చుకున్నారు. అస్సాంలోని గువాహటిలో ఫిబ్రవరి 10న ఈ పోటీలు ముగిశాయి. నందిని ఈ పోటీల్లో లాంగ్‌జంప్, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. యశ్వంత్ అండర్-20 బాలుర 110 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 1,500 మీటర్ల పరుగు(ఇండోర్)లో సరికొత్త ప్రపంచ రికార్డు
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : గుడాఫ్ సెగే
ఎక్కడ : ఫ్రాన్స్
ఎందుకు : 1,500 మీటర్ల పరుగును 3 నిమిషాల 53.09 సెకన్లలో పూర్తి చేసినందుకు

Published date : 11 Feb 2021 05:53PM