Skip to main content

మైత్రి సేతు బ్రిడ్జిను ఏ రెండు దేశాల మధ్య నిర్మించారు?

భారత్–బంగ్లాదేశ్లను కలుపుతూ ఫెని నదిపై నిర్మించిన ‘‘మైత్రి సేతు’’ బ్రిడ్జి ప్రారంభమైంది.
Current Affairs

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 9న ఈ బ్రిడ్జిని వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించి, ప్రసంగించారు. ఉభయ దేశాల మధ్య అనుసంధానత పెరగడం వల్ల స్నేహంతో పాటు వ్యాపారమూ అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ నౌకాశ్రయాన్ని ఈశాన్య రాష్ట్రాలకు నదీ మార్గం ద్వారా కలిపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.


ఫెని నదిపై...

త్రిపురలోని సబ్రూం, బంగ్లాదేశ్‌లోని రాంఘర్‌లను కలుపుతూ ఫెని నదిపై మైత్రి సేతు బ్రిడ్జిని నిర్మించారు. రూ.133 కోట్ల నిధులతో భారత్‌కు చెందిన జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈ వంతెనను నిర్మించింది. వంతెన పొడవు: 1.9 కి.మీ.

గీతా శ్లోకాలపై వ్యాఖ్యానాలు...

గీతా శ్లోకాలపై 21 మంది ప్రముఖ పండితులు రాసిన వ్యాఖ్యానాల సంకలనాన్ని ప్రధాని మోదీ మార్చి 8న ఆవిష్కరించారు. ఈ సంకలనాన్ని జమ్మూకశ్మీర్‌కు చెందిన కురువృద్ధ కాంగ్రెస్‌ నేత కరణ్‌ సింగ్‌ చైర్మన్‌గా ఉన్న ధర్మార్థ ట్రస్టీ ప్రచురించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : మైత్రి సేతు బ్రిడ్జి ప్రారంభం
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : త్రిపురలోని సబ్రూం, బంగ్లాదేశ్‌లోని రాంఘర్‌ల మధ్య అనుసంధానం పెంచేందుకు
Published date : 10 Mar 2021 06:15PM

Photo Stories