మైనారిటీ విద్యా సంస్థలకూ నీట్: సుప్రీంకోర్టు
Sakshi Education
వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్) మైనారిటీ, ప్రైవేటు విద్యాసంస్థలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యాసంస్థలు, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో నీట్ ద్వారా గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు జరపాలని ఏప్రిల్ 29న తీర్పు వెలువరించింది. కేంద్రం విడుదల చేసిన నీట్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వెల్లూర్‌లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, మణిపాల్ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం మెడికల్ కాలేజ్ తదితర మైనారిటీ, ప్రైవేటు వైద్య విద్యా సంస్థలు దాఖలు చేసిన 76 పిటిషన్లను విచారించిన ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జరుగుతున్న అనేక అవకతవకలను అడ్డుకునే దిశగా ‘నీట్’ను ప్రారంభించినట్లు జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎం.ఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Published date : 30 Apr 2020 07:31PM