మాస్ మ్యూచువల్ కెపబిలిటీ సెంటర్ ఎక్కడ ఏర్పాటు కానుంది?
Sakshi Education
అమెరికాకు చెందిన ప్రముఖ జీవిత బీమా, ఆర్థిక సేవల సంస్థ... మసాచుసెట్స్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ (మాస్ మ్యూచువల్) కంపెనీ తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కెపబిలిటీ సెంటర్)ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : మసాచుసెట్స్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ (మాస్ మ్యూచువల్) కంపెనీ
ఎక్కడ : హైదరాబాద్
రూ.1,000 కోట్ల పెట్టుబడులతో కంపెనీ తమ సెంటర్‌ను నెలకొల్పనుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు జనవరి 11న ప్రకటించారు. 1851లో మాస్ మ్యూచువల్ కంపెనీ ఏర్పాటైంది.
జీసీసీలు ఏం చేస్తాయి?
- గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు నిపుణులైన ఉద్యోగులను, అత్యుత్తమ మౌలిక సదుపాయాలను ఒకేచోట కేంద్రీకృతం చేసి తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తాయి.
- బ్యాక్ ఆఫీసు సేవలు, కార్పొరేట్ వ్యాపార మద్దతు కార్యకలాపాలు, కాల్ సెంటర్ల సేవలు ఇక్కడి నుంచి కొనసాగిస్తాయి.
- ఐటీ సేవల విషయానికి వస్తే... యాప్‌ల అభివృద్ధి, నిర్వహణ, రిమోట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్ప్ డెస్క్‌లు ఈ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల నుంచే నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : మసాచుసెట్స్ మ్యూచువల్ ఇన్సూరెన్స్ (మాస్ మ్యూచువల్) కంపెనీ
ఎక్కడ : హైదరాబాద్
Published date : 12 Jan 2021 05:51PM