మార్కెట్లోకి విడుదలైన తొలి కరోనా వ్యాక్సిన్?
తొలివిడత టీకా డోసులు ప్రజలకి అందుబాటులో ఉన్నాయని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 8న ప్రకటించింది.
భారత్‌లో మూడో దశ ప్రయోగాలు...
రష్యా తన వ్యాక్సిన్‌ను భారత్‌లో మూడో దశ ప్రయోగాలు జరిపి మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉంది. దీనికి సంబంధించి రష్యా నుంచి ప్రతిపాదనలు అందినట్టుగా నీతి అయోగ్ సభ్యుడు వి.కె. పాల్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనల్ని మన దేశంలో పలు మెడికల్ కంపెనీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేసియా, ఫిలిప్‌పైన్స్ వంటి దేశాలు రష్యా టీకాకు అనుమతులు మంజూరు చేశాయి.
చదవండి: ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన తొలి కరోనా వ్యాక్సిన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ మార్కెట్లో విడుదల
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ఎక్కడ : రష్యా
ఎందుకు : కోవిడ్-19 కట్టడికి