Skip to main content

మారిషస్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్, మారిషస్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 17న ఆమోదం తెలిపింది.
Current Affairs
కస్టమ్స్ సుంకాల తగ్గింపుతో ఇరు దేశాల ఉత్పత్తులకు ద్వారాలు తెరవడం ఈ ఒప్పందంలో భాగం. ఒప్పందం ద్వారా భారత్‌కు చెందిన 300 రకాల ఉత్పత్తులు తక్కువ కస్టమ్స్ సుంకాలకే మారిషస్ మార్కెట్‌లో ప్రవేశం చేసేందుకు వీలు కలుగుతుంది. అలాగే మారిషస్‌కు చెందిన 615 ఉత్పత్తులు భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి లభిస్తుంది.

టెలికం తయారీకి రూ.12,195 కోట్లు
దేశీయంగా టెలికం ఉపకరణాల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 17న కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద టెలికం గేర్ల తయారీకి రూ.12,195 కోట్ల రాయితీలను ఐదేళ్ల కాలంలో ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. 2021, ఏప్రిల్ 1 నుంచి టెలికం గేర్ల తయారీకి పీఎల్‌ఐ పథకం అమల్లోకి రానుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారత్, మారిషస్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందానికి ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : కస్టమ్స్ సుంకాల తగ్గింపుతో ఇరు దేశాల ఉత్పత్తులకు ద్వారాలు తెరవడం కోసం
Published date : 19 Feb 2021 05:59PM

Photo Stories