Skip to main content

మార్చి 28న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

శ్రీరామచంద్రుడి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు రైల్వేశాఖ ప్రారంభించనున్న ప్రత్యేక రైలు ‘శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్’ 2020, మార్చి 28న ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది.
Current Affairs ఈ విషయాన్ని ఇండియన్ రెల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఫిబ్రవరి 19న వెల్లడించింది. మొత్తం 16 రాత్రులు -17 పగళ్ల పాటు ఈ యాత్ర సాగనుందని పేర్కొంది. రామాయణ ఇతివృత్త నేపథ్యంతో కూడిన ఈ రైలు లోపలా బయటా రామాయణాన్ని జ్ఞప్తికి తెచ్చేలా తీర్చిదిద్దుతామని, రైల్లో రామాయణ కీర్తనలు ఉంటాయని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి రామాయణంతో ముడిపడి ఉన్న ప్రాంతాలగుండా ఈ రైలును నడిపిస్తామని చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020, మార్చి 28 నుంచి శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : భారతీయ రైల్వే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : శ్రీరామచంద్రుడి పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు..
Published date : 20 Feb 2020 07:14PM

Photo Stories