Skip to main content

మార్చి 12న వింగ్స్ ఇండియా 2020 సదస్సు

హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ వేదికగా మార్చి 12 - 15 తేదీల మధ్య ‘వింగ్స్ ఇండియా 2020’సదస్సును నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించింది.
Current Affairsసదస్సు ఏర్పాట్లకు సంబంధించి జనవరి 9న ఢిల్లీలో సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు హాజరుకానున్నారు. దేశ వైమానిక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు వింగ్‌‌స ఇండియా సదస్సు ఉపయోగపడుతుందని కేంద్రప్రభుత్వం అంచనా వేస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వింగ్స్ ఇండియా 2020 సదస్సు
ఎప్పుడు : మార్చి 12 - 15 తేదీల మధ్య
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్
ఎందుకు : దేశ వైమానిక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు

మాదిరి ప్రశ్నలు
Published date : 09 Jan 2020 05:30PM

Photo Stories