Skip to main content

మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్, తమిళనాడు క్రికెట్‌కు సుదీర్ఘ కాలం మూలస్తంభంలా నిలిచిన వక్కడై బిశ్వేశ్వరన్ (వీబీ) చంద్రశేఖర్(58) గుండెపోటు కారణంగా ఆగస్టు 15న చెన్నైలో కన్నుమూశారు.
1988-90 మధ్య భారత్ తరఫున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్ మొత్తం 88 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో తమిళనాడు జట్టు తరఫున 4,999 పరుగులు చేశాడు. తమిళనాడు ఓపెనర్‌గా చిరస్మరణీయ ఇన్నింగ్‌‌స ఆడిన వీబీ 81 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు. 1988-89 ఇరానీ కప్ మ్యాచ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం 2012లో తమిళనాడు కోచ్‌గా, భారత సెలక్టర్‌గా పనిచేశారు. కామెంటేటర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ ప్రస్తుతం చెన్నైలో సొంత క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారత మాజీ క్రికెటర్కన్నుమూత
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎవరు : బిశ్వేశ్వరన్ (వీబీ) చంద్రశేఖర్(58)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : గుండెపోటుకారణంగా
Published date : 16 Aug 2019 04:21PM

Photo Stories