Skip to main content

మాజీ క్రికెటర్‌ అశ్విన్‌ యాదవ్‌ కన్నుమూత

హైదరాబాద్‌ రంజీ క్రికెట్‌ జట్టు మాజీ పేస్‌ బౌలర్‌ అశ్విన్‌ యాదవ్‌(33) తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఏప్రిల్ 24న హైదరాబాద్ లో హఠాన్మరణం చెందాడు.
Current Affairs 2007 ఏడాది రంజీ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన అశ్విన్... మూడేళ్లపాటు హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 14 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ వన్డేల్లో 10 మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు... దేశవాళీ టి20ల్లో రెండు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీశాడు. చివరిసారి అశ్విన్‌ 2010లో అక్టోబర్‌ 19న కర్ణాటకతో జరిగిన టి20 మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగాడు. చివరిసారి అశ్విన్‌ 2010లో అక్టోబర్‌ 19న కర్ణాటకతో జరిగిన టి20 మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున బరిలోకి దిగాడు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్‌ రంజీ క్రికెట్‌ జట్టు మాజీ పేస్‌ బౌలర్‌ కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 24
ఎవరు : అశ్విన్‌ యాదవ్‌(33)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : . గుండెపోటు కారణంగా...
Published date : 26 Apr 2021 07:49PM

Photo Stories