లోకాయుక్త పరిధిలోకి మహారాష్ట్ర సీఎం
Sakshi Education
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, విపక్ష నేతలను లోకాయుక్త పరిధిలోకి తేవాలని ఆ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన జనవరి 29న జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల అవినీతిని విచారించేందుకు రాష్ట్రస్థాయిలో లోకాయుక్త అనే స్వతంత్ర నిర్ణయాక వ్యవస్థను ఏర్పాటుచేశారు. సీఎంపై అవినీతి ఆరోపణలు ఉంటే లోకాయుక్త రహస్య పద్ధతిలో విచారణ జరుపుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లోకాయుక్త పరిధిలోకి మహారాష్ట్ర సీఎం
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : మహారాష్ట్ర కేబినెట్
క్విక్ రివ్యూ :
ఏమిటి : లోకాయుక్త పరిధిలోకి మహారాష్ట్ర సీఎం
ఎప్పుడు : జనవరి 29
ఎవరు : మహారాష్ట్ర కేబినెట్
Published date : 30 Jan 2019 05:29PM