లక్ష్మీ విలాస్ బ్యాంక్ను ఏ బ్యాంకులో విలీనం చేయనున్నారు?
Sakshi Education
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)ను సింగపూర్‌కి చెందిన సంస్థ డీబీఎస్ భారత విభాగం డీబీఎస్ బ్యాంక్ ఇండియా (డీబీఐఎల్)లో విలీనం చేయనున్నారు.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ నవంబర్ 25న ఆమోదం తెలిపింది. ఈ విషయమై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఒక ప్రకటనను విడుదల చేస్తూ... నవంబర్ 27 నుంచి ఈ విలీనం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆ రోజు నుంచి ఎల్‌వీబీపై విధించిన మారటోరియం కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మారటోరియం గడువు 2020, డిసెంబర్ 16 వరకు ఉంది.
1926లో స్థాపన...
రిటైల్, మిడ్-మార్కెట్, కార్పొరేట్ రంగాల్లో బిజినెస్ చేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంకును వీఎస్‌ఎన్ రామలింగ చెట్టియార్ నేతృత్వంలో ఏడుగురు వ్యాపారవేత్తలు 1926లో స్థాపించారు. 2019 జూన్ 30వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 569 బ్రాంచీలు ఉన్నాయి. 2020 సెప్టెంబర్‌తో ముగిసిన కాలానికి బ్యాంక్ వ్యాపారం రూ.37,595 కోట్లు. నికర నష్టాలు రూ.397 కోట్లు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :క్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ)ను డీబీఐఎల్‌లో విలీనానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో

Published date : 26 Nov 2020 06:08PM