Skip to main content

లక్నోలో వాజ్‌పేయి భారీ విగ్రహావిష్కరణ

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Current Affairsవాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే అటల్ బిహారీ వాజ్‌పేయి పేరుతో ఏర్పాటు కానున్న వైద్య విశ్వవిద్యాలయానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లక్నోలోని లోక్‌భవన్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంపై ప్రధాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులు తమ హక్కులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనల్లో ఇప్పటిదాకా మొత్తం 15 మంది మరణించగా, సుమారు 263 మంది గాయపడ్డారు.

25 అడుగుల ఎత్తు
వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని శిల్పి రాజ్‌కుమార్ పండిట్ రూపొందించారు. 25 అడుగుల ఎత్తు, 5 టన్నుల బరువున్న ఈ విగ్రహతయారీకి రూ.89 లక్షలు ఖర్చయింది. పండిట్ నేతృత్వంలోని 65 మంది కళాకారులు ఆరు నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. బిహార్‌కు చెందిన రాజ్‌కుమార్ పండిట్ జైపూర్ కేంద్రంగా కాంస్యం, అల్యూమినియం, ఇత్తడి వంటి లోహాలతో ప్రముఖుల విగ్రహాలను వేలాదిగా తయారు చేశారు. ఈయన తయారుచేసిన అత్యంత ఎత్తైన 47 అడుగుల పాండవవీరుడు అర్జునుడి విగ్రహాన్ని జైపూర్‌లో ప్రతిష్టించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహం ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 25
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : లక్నో, ఉత్తరప్రదేశ్
ఎందుకు : వాజ్‌పేయి 95వ జయంతి సందర్భంగా
Published date : 26 Dec 2019 05:46PM

Photo Stories