లెబనాన్ ప్రధాని హసన్ రాజీనామా
Sakshi Education
లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ ఆగస్టు 10న తన పదవికి రాజీనామా చేశారు.
దాదాపు వారం క్రితం బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలని ప్రధాని హసన్ నిర్ణయించుకున్నారు. ‘ఇక్కడ ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని తేలింది. ఇకపై ప్రజలతో కలిసి మార్పుకోసం పోరాడుతానన్నారు. ఈ రోజు నా ప్రభుత్వం రాజీనామా చేస్తోంది. లెబనాన్ ను దేవుడే రక్షించు గాక’ అని హసన్ వ్యాఖ్యానించారు.
చదవండి: లెబనాన్ రాజధాని బీరుట్ లో భారీ పేలుడు
క్విక్ రివ్యూ :
ఏమిటి : లెబనాన్ ప్రధాని రాజీనామా
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు :హసన్ దియాబ్
ఎందుకు : ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలువెల్లువెత్తడంతో
Published date : 11 Aug 2020 05:38PM