ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ముగింపు
Sakshi Education
అస్సాంలోని గువాహటిలో జనవరి 10న ప్రారంభమైన 3వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జనవరి 22న ముగిశాయి.
ఈ క్రీడల్లో ఓవరాల్‌గా మహారాష్ట్ర 78 స్వర్ణాలు, 77 రజతాలు, 101 కాంస్యాలతో కలిపి మొత్తం 256 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. హరియాణా (68+60+72) మొత్తం 200 పతకాలు నెగ్గి రెండో స్థానంలో... ఢిల్లీ (39+36+47) మొత్తం 122 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 7 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలు సాధించి 15వ స్థానం సాధించింది. ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో 22వ స్థానం దక్కించుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 3వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ముగింపు
ఎప్పుడు : జనవరి 22
ఎక్కడ : గువాహటి, అస్సాం
క్విక్ రివ్యూ :
ఏమిటి : 3వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ముగింపు
ఎప్పుడు : జనవరి 22
ఎక్కడ : గువాహటి, అస్సాం
Published date : 23 Jan 2020 05:43PM