Skip to main content

కరోనాతో యూపీ మంత్రి కమల్‌రాణిమృతి

యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రి కమల్‌రాణి (62)ని కరోనాపొట్టన పెట్టుకుంది. ఆమె ఆగస్టు 2న లక్నోలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు.
Edu news

రాష్ట్రంలో కరోనా వల్ల ఒక మం త్రి మరణించడం ఇదే తొలిసారి. యూపీ కేబినెట్‌లో ఆమె ఏకైక మహిళ. కమల్‌రాణికి జూలై 18న పరీక్షలు చేయ గా, కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె డయాబెటిస్, హైపర్‌ టెన్షన్, హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా
కరోనా మహమ్మారి బారిన పడిన ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్‌ పురోహిత్‌, కర్ణాటక సీఎం యెడియూరప్ప తాజాగా కరోనాబారినపడ్డారు. తనలో కరోనా వైరస్‌ ప్రా«థమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(55) ఆగస్టు 2న ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోనిమేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి
: యూపీ సాంకేతిక విద్యా శాఖ మంత్రికన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : కమల్‌రాణి (62)
ఎక్కడ :
లక్నో, ఉత్తరప్రదేశ్
ఎందుకు :కరోనా వైరస్ కారణంగా
Published date : 04 Aug 2020 12:02PM

Photo Stories